నెలాఖరులోగా పార్టీ, నామినేటెడ్ పదువులన్నీ భర్తీ చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయo ఎన్టీఆర్ భవన్ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో ఆయన భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అధినేతలని, వారందరికీ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లపైనే ఉందని ఆయన స్పష్టం చేశాను. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించి, అర్జీలు తీసుకుని వారి స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు.