ప్రజాసేవలో కొమ్మాలపాటి జన్మదిన వేడుకలు..!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే,  పల్నాడు జిల్లా జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి.

జిల్లా కేడర్ తోపాటు బీజేపీ, జనసేన శ్రేణులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి.., భారీ కేకులు కట్ చేసి.., విషెస్ తెలిపారు. ఈ నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గ టీడీపీ నాయకులు, తెలుగు యువత మాజీ అధ్యక్షులు షేక్ మోసిన్ తనదైన సేవ దృక్పథంతో కొమ్మాలపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేదరికం ఇబ్బంది పడుతున్న ఓ కుటుంబానికి ఆర్ధికంగా చిరు వ్యాపారంతో నిలదొక్కునేందుకు తోపుడు బండి అందజేసి.., బాసటగా నిలబడ్డారు. ఆ కుటుంబ సభ్యుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి.., అభిమాన నాయకుడు కొమ్మాలపాటి శ్రీధర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మోసిన్ మాట్లాడుతూ.. అందరివాడు.., నాకు ఎంతో ఆత్మీయుడు కొమ్మాలపాటి జన్మదిన నాడు ఇలా సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన పుట్టిన రోజు నాడు  ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం నా అదృష్టమని, ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ అల్లాహ్ ను కోరుతున్నాని మోసిన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బచ్చు మధుసూధన రావు, బజరంగ్ దల్, సరస్వతీ శిశుమందిర్ స్టేట్ నాయకులు చిరుమావిళ్ల గోపి తదితరులు పాల్గొన్నారు.