యాంత్రీకరణతోనే రైతుకు వెన్నుదన్ను ..!

వ్యవసాయంలో యంత్రీకరణ రైతుకు వెన్నుదన్నుల నిలిచి.., సాగును లాభసాటిగా మారుస్తుందని, అందుకే కూటమి ప్రభుత్వం యంత్ర సాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు.

గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో రైతులకు కిసాన్ డ్రోన్ ల అందజేత కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే జూలకంటి హాజరయ్యారు. మండల రైతులకు డ్రోన్ లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., వ్యవసాయానికి సంకేతికతను జోడిస్తేనే సాగు ఫలప్రదమౌతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంటా శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ ఏవో నరసింహారావు, సర్పంచ్ బాలు నాయక్, ఎంపీపీ బొల్నేడి శ్రీనివాసరావు, టీడీపీ మండలాధ్యక్షులు గోళ్ల సురేష్ యాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంగులూరి అంజయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి పంగులూరి పుల్లయ్య, యువ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి, మునుగోటి సత్యం, కటికల బాలకృష్ణ, తండా మస్తాన్ జానీ, బొమ్మిన శేషగిరి తదితరులు పాల్గొన్నారు.