అలజడులు సృష్టిస్తే తాట తీస్తాం – ఎమ్మెల్యే జూలకంటి వార్నింగ్..!

గతంలో మీకున్న అధికారమే.. ఇప్పడు మాకు ఉందని వైసీపీ నాయకులను ఉద్దేశించి మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గుర్తు చేశారు. కానీ… మీలా మేము అరాచకం చేయడం లేదని చెప్పారు. అన్నీ అణచివేసుకుని మాచర్ల ను అభివృద్ధి పథంలో దూసుకుపోయేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని వెల్లడించారు. అక్కడక్కడ వైసీపీ నాయకులు, పిన్నెల్లి అనుచరులు అలజడులు సృష్టించాలని చూస్తున్నారని.., మీ ఆగడాలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఖబడ్దార్ హెచ్చరిస్తున్నాం.. నీచ రాజకీయాలకు చేస్తే ఊరుకోం అని తేల్చిచెప్పారు.