ఈ నెల 12న జరిగే ప్రమాణస్వీకారోత్సవాలకు తరలిరండి..!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, మాచర్ల నియోజకవర్గ శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచనలతో మాచర్ల నియోజకవర్గ పరిధిలోని నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని మాచర్ల పట్టణ అధ్యక్షులు, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ కొమెర దుర్గారావు పేర్కొన్నారు.

ఈనెల 12వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మాచర్ల పట్టణంలోని మానుకొండ కళ్యాణ మండపం నందు క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు మరియు కో కన్వీనర్లు, మండల, గ్రామ/వార్డు ప్రెసిడెంట్లు మరియు ప్రధాన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం అతిరథ మహారధుల సమక్షంలో జరుగుతుందని ఆయన వెల్లడించారు.

కావున ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ హాజరు కావాలని ఆయన కోరారు.