లా అండ్ ఆర్డర్ అమలు విషయంలో రాజీ పడొద్దు..!

లా అండ్ ఆర్డర్ అమలు విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు.

అమరావతిలోని తుళ్లూరు నూతన సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరై, కార్యాలయాన్ని ప్రారంభించారు. కక్షిదారులకు మెరుగైనా సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా,  కోస్టల్ జోన్ డిఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పి వకుల్ జిందాల్, తుళ్లూరు డిఎస్పి మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.