ప్రజా సమస్యలకు జవాబుదారీ వేదిక ప్రజా దర్బార్ అని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. శనివారం వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ.., అనేక సమస్యపై ప్రజలు ప్రభుత్వ కార్యాలయం మెట్లెక్కుతుంటే.., అవి అక్కడ సత్వర పరిష్కారం లభించకుంటేనే, ఎమ్మెల్యే ఇంటి గడప తొక్కాల్సిన పరిస్ధితి వస్తోందని వివరించారు. సమస్య ప్రథమిక దశలోనే స్థానిక అధికారులు పరిష్కరిస్తే.., ప్రజాప్రతినిధుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాదర్బార్ లో ప్రజలిచ్చే ప్రతి సమస్యకు పరష్కారం లభిస్తోందని వెల్లడించారు.
ప్రజాదర్బార్ కు 56 అర్జీలు..!
ఎమ్మెల్యే జూలకంటి అధ్యక్షతన నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ లో వివిధ సమస్యలపై ప్రజలు 56 అర్జీలు అందించారు. వీటిల్లో దాదాపు ఎక్కువ శాతం వైసీపీ హయంలో జరిగిన భూకబ్జాలు, భూ మాఫియా, స్థల వివాదాలు, కొత్త పింఛన్లు అందించాలని, చీట్ చేసి రౌడీయిజం చేస్తున్న వారిపై ఫిర్యాదు వంటి పలు అంశాలపై కక్షిదారులు అర్జీల రూపంలో ఫిర్యాదులు అందించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పరిష్కరానికి సంబంధిత అధికారులకు సూచించారు. తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గురజాల ఆర్డీవో మురళీ, మాచర్ల తహశీల్దార్ కిరణ్ కుమార్, వెల్దుర్తి ఎస్సై సమందర్ వలి, వడ్డెర కార్పోరేషన్ డైరెక్టర్ కొమెర దుర్గారావు, ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్, మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజబోయిన మధు, టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు వజ్రం నాయక్, టీడీపీ సీనియర్ నాయకులు జూలకంటి చిరంజీవి రెడ్డి, యువ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి, కేశిరెడ్డి హనిమిరెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.