ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగనున్న కారంపూడి వీర్లగుడి ప్రాంగణంలో జరిగే పల్నాటి విరారాధన ఉత్సవాలపై దిగ్విజయంగా నిర్వహించేందుకు డివిజన్ స్ధాయి అధికారులతో మంగళవారం ఉదయం 11 గంటలకు గురజాల ఆర్డీవో మురళీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరగనున్నది.


ఈ సమావేశానికి మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొంటారని తెలుస్తోంది.