
ఆపత్కాలంలో కార్యకర్తకు టీడీపీ రూ.100 సభ్యత్వం ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బొదిలవీడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బెల్లంకొండ శ్రీనివాసరావు రోడ్డుప్రమాదంలో మృతి చెందగా.., వారి కుటుంబానికి పార్టీ సభ్యత్వం ప్రమాదబీమా రూ. 5 లక్షల నగదు చెక్కును భార్య లక్ష్మీదుర్గకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటి పెద్దను కొల్పొయి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అండగా ఉండేందుకు అధినేత చంద్రబాబు, జాతీయ ప్రదాన కార్యదర్శి లోకేష్ సభ్యత్వ బీమా తీసుకొచ్చారని చెప్పారు. కార్యకర్తల సంక్షేమ ధ్యేయంగా టీడీపీ పాటుపడుతోందని ఎమ్మెల్యే జూలకంటి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మందలపు రామకృష్ణ, యూనిట్ ఇంచార్జ్ సాదనాల ప్రసాద్, సాదనాల వెంకట్రామయ్య తదితరులు ఉన్నారు.