కార్యకర్తలకు ఆర్థిక భరోసా సభ్యత్వ బీమా..!

టీడీపీ కార్యకర్తల కష్టకాలంలో ఆర్ధిక భరోసాను ప్రమాద బీమా రూపంలో అధిష్టానం అందిస్తోందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గుర్తుచేశారు. నియోజకవర్గ పరిధిలో రూ.100 సభ్యత్వలం తీసుకుని వివిధ రకాల ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు కార్యకర్తల కుటుంబాలకు వెల్దుర్తి  క్యాంపు కార్యాలయంలో రూ. 5 లక్షల నగదు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పోరేషన్ డైరెక్టర్ కొమెర దుర్గారావు, టీడీపీ యువనాయకులు తోట వీరాంజినేయులు, లోయపల్లి హనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.