ప్యాలెస్ పక్షికేం తెలుసు రైతు కష్టం..!

రైతాంగాన్ని గాలికొదిలేసి.., ఐదేళ్లు ప్యాలెస్ లో నిద్రపోయే వారికేం తెలుసు రైతు కష్టమని పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకులు, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన క్యాంపు కార్యాలయంలో పల్నాడు విజన్ తో మాట్లాడుతూ.. వైసీపీ ఐదేళ్ల పాలనపై ధ్వజమెత్తారు. వరదల్లో బురద రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా? జగన్ అని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవతో పంట పెట్టుబడి సాయం అందించి రైతును ఆదుకుంది సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకుని.., బుద్ది తెచ్చుకోవాలని జగన్ అండ్ కో ఈ సందర్భంగా యాగంటి సూచించారు.