కారంపూడి తిరునాళ్లకు ఏర్పాట్లు పటిష్టంగా పర్యవేక్షించండి..!

ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగనున్న కారంపూడి వీర్లగుడి ప్రాంగణంలో జరిగే పల్నాటి విరారాధన ఉత్సవాలకు ఏర్పాట్లు పటిష్టంగా పర్యవేక్షించాలని గురజాల ఆర్డివో మురళీ కోరారు.

మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్ధాయి అధికారులతో మందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఉత్సవాల్లో అత్యధిక ప్రాధన్యత ఇచ్చే ఈ తిరునాళ్లకు భక్తులతో పాటు రెండు తెలుగురాష్ట్రాల నుంచి వీరాచరవంతులు పెద్ద సంఖ్యలో హాజరౌతారని, అందుకు తగ్గట్లుగా తాగునీరు, భోజన వసతి, విద్యుత్, లా అండ్ ఆర్డర్ వంటివి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.