మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి శనివారం ఉదయం మాచర్ల పట్టణంలో పర్యటించనున్నట్లు శాసన సభ్యుల వారి కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. స్థానిక 1వ,15వ వార్డులలో లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు, వరద బాధితులకు ఉచితంగా నిత్యవసర సరుకుల పంపిణీ చేస్తారని వెల్లడించారు. ఆ తరువాత ఓ ప్రైవేటు అపార్ట్మెంట్ నిర్మాణాలకు నిర్వహించే భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.
