నిదానంపాటి అమ్మవారి విశేష పూజలు..!

దుర్గిమండలం, శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ మాత అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక శుక్రవారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొక్కులు తీర్చుకునేందుకు భక్తుమహాశ్రయులు తరలివచ్చారు. గర్భాలయంలో కొలువుదీరిన అమ్మవారికి వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, విశేషాభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి, భక్తులకు దర్శన బాగ్యం కల్పించారు.