
హిందువులకు అత్యంత పవిత్రమైన కార్తీక మాస పర్వదినాలను పురష్కరించుకుని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అమరావతి అమరేశ్వరుడి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయంలో క్యూలైన్ తో పాటు కార్తీక స్నానాలకు ప్రత్యేక ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. భక్తుల తాకిడి ఈ ఏడాది అధికారంగా ఉంటున్నట్లు ఆలయ అధికారులు అంచన వేస్తున్నారు. అందుకు తగ్గట్లు అన్నీ ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.