పేదొడి ఆరోగ్యానికి ఆసరా సీఎం రిలీఫ్ ఫండ్..!

రాష్ట్రంలోని ప్రతి పేదొడి ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నలుస్తోందని సత్తెనపల్లి శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో దాదాపు 23 మందికి రూ. 16 లక్షల 97 వేల 608 విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు కన్నా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., వైద్య ఖర్చుల సాయం అందజేయడంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలోనే ముందు వరసలో ఉందని చెప్పుకొచ్చారు.