
అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సత్తెనపల్లి శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఉద్ఘాటించారు. నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం గ్రామంలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనం, రూ. కోటి, 8 లక్షల వ్యయంతో నిర్మించిన ఉప ఖజానా కార్యాలయ నూతన భవనం, తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.., రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి అత్యంత వేగంగా పుంజుకుంటుందని స్పష్టం చేశారు.