ముప్పాళ్లలో పర్యటించిన మంత్రి సవిత..!

సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాళ్ల మండలంలో  బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నాలక్ష్మీనారాయణలు పర్యటించారు.  మాదల గ్రామంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ పాఠశాలను వారు సందర్శించారు. అక్కడున్న మౌలిక వపతులను పర్యవేక్షించారు. విద్యార్దులకు అందుతున్న భోజన సదుపాయాలను సమీక్షించారు. నాణ్యమైన విద్యను అందించడంలో సౌకర్యాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం రాజీపడదని ఉపాధ్యాయులకు సూచించారు. ఎటువంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.