కపోతేశ్వర కరుణించు..!

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, చేజర్ల గ్రామంలో వేంచేసియున్న శ్రీ కపోతేశ్వర స్వామి వారికి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం పర్వదినాల్లో స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది కన్నా పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసిన కన్నా ను సాదరంగా ఆహ్వానించి అధికారులు ఘనంగా సత్కరించారు.