బీహార్ ఎన్నికల్లో గెలుపుకు ఎన్డీఏ కూటమి శ్రేణులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. పాట్నాలో ఎన్నికల ప్రచారం ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని, తనదైనశైలిలో ప్రచారం ముమ్మరం చేశారు.

అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో బీహార్ పాత్ర చాలా కీలకమైందన్నారు. బీహార్ సర్వతోముఖాభివృద్ధికి మరోమారు బీహార్ యువత ఎన్.డీ.ఏను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీలో 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీకి అవకాశం ఇవ్వడం వల్ల తీవ్రంగా నష్టపోయామని, అటువంటి పరిస్థితులు బీహార్ లో పట్టకూడాదని యువతకు విజ్ఞప్తి చేశారు లోకేష్.

బీహార్ లో మూడు కారణాల వల్ల ఎన్.డీ.ఏ ని గెలిపించాల్సిన అవసరం చెప్పుకొచ్చారు. లీడర్ షిప్ ట్రాక్ రికార్డ్, డబుల్ ఇంజన్ సర్కారు, ప్రభుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.