
క్రమశిక్షణ పునికిపుచ్చుకున్న పోరాట యోధులు టీడీపీ కార్యకర్తలని , ఇటువంటి నిబద్దత కూడిన వ్యవస్థ దేశంలో ఏ రాజకీయ పార్లీకి లేదని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణంలోని రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ, నియోజకవర్గ పరిశీలకులు తాతా జయప్రకాశ్ నారాయణ హాజరయ్యారు. కమిటీల సభ్యులతో ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ.., స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన 90 శాతం హామీలన్నీ నెరవేర్చిందని, సూపర్ సిక్స్ పథకాల హామీ సూపర్ హిట్ అయ్యిందని ఆయన చెప్పారు.