
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అదేశాల మేరకు నియోజకవర్గంలో నూతన కమిటీల ప్రమాణస్వీకారోత్సం నేడు అనగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్నట్లు మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మానుకొండ కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమానికి నూతనంగా ప్రమాణస్వీకారం చేయనున్న మండల, గ్రామ కమిటీ సభ్యులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు. నియోజకవర్గం వ్యాప్తంగా పండుగులా నిర్వహించే కమిటీల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని, కార్యక్రమానికి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.