పల్నాడు జిల్లా ఇంచార్జీ మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జన్మదిన వేడుకలు టీడీపీ పట్టణాధ్యక్షులు, రాష్ట్ర వడ్డెర కార్పోరేషన్ డైరెక్టర్ కొమెర దుర్గారావు ఆద్వర్యంలో ఘనంగా జరిగాయి.

ఆదివారం దుర్గారావు క్యాంపు కార్యాలయంలో పట్టణ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి, గొట్టిపాటికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా కొమెర దుర్గారావు మట్లాడుతూ.., సౌమ్యుడు, నిగర్వి అయిన గొట్టిపాటి పల్నాడు జిల్లాకు ఇంచార్జీ మంత్రిగా ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇటువంటి పుట్టిన రోజులు మరిన్నో జరుపుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు అధ్యక్షలు మంజుల వెంకటేశ్వర్లు, 31వ వార్డు ఇంచార్జి దానంబాబు, 30వ వార్డు ఇంచార్జీ మాచర్ల బాబు, 10వ వార్డు బూత్ ఇంచార్జీ షేక్ జానీ, చల్లా వెంకటేశ్వర్లు, బత్తుల కుమారు, ఉప్పతొళ్ల దుర్గారావు, కొమెర సాంబ, గొల్లిపోగు మరియదాసు, కమలాకర్, అడవిరాముడు, నర్రా రాముడు, దాసరయ్య, మంజుల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.