
తన జీవితం ప్రజా సేవకే అన్నట్లు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తున్న తీరు నేడు చర్చల్లో నిలిస్తున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం 72వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన లోకేష్ ప్రజలు, కార్యకర్తల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల కక్షిదారుల నుంచి స్వీకరించిన ఆర్జీలను పరిశీలించి, వారి బాధలను దగ్గరుండి విని, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్.