
సీసీఐ కేంద్రాలు ఏర్పాటు ద్వారా ప్రత్తి రైతుకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఉద్ఘాటించారు.
సోమవారం గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణం, జానపాడు రోడ్డులోని అమరలింగేశ్వర జిన్నింగ్ మిల్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తో కలిసి, ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది.