
మత సామరస్యతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. వినుకొండ పట్టణంలోని తిమ్మయపాలెం రోడ్డులో ఉన్న ఈద్గా చుట్టూ నూతన ప్రహరిగోడ నిర్మాణాలకు దాదాపు రూ. 40 లక్షల నిధులతో నిర్మించబోయే పనులకు చేసిన భూమి పూజా కార్యక్రమంలో పాల్గొని, శంకుస్థాపన చేశారు. ప్రజల సౌకర్యార్థం అవసరమైన అన్ని అభివృద్ధి పనులను చేపడతామని తెలిపారు. ఈ నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, ముస్లిం మత పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.